logo
సినిమా

Balakrishna: అఖండ ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్న బాలకృష్ణ....

Balakrishna Speaks of Akhanda Pan World Cinema
X

అఖండ ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్న బాలకృష్ణ....

Highlights

Balakrishna:ఇది ప్యాన్ ఇండియన్ సినిమా కాదు అంటున్న బాలయ్య..

Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 50 రోజులు థియేటర్లలో నడిచిన ఈ చిత్రం 200 కోట్ల రెవెన్యూ ని వెనక్కి వేసింది. ఈ మధ్యకాలంలో 50 రోజులు థియేటర్లలో ఆడిన సినిమాగా అఖండ మంచి పేరు తెచ్చుకుంది. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడారు.

"50 రోజులుగా మీరు మీ ప్రేమను చూపిస్తున్నారు. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాము. మా కలలు నిజం అయినట్లు అనిపిస్తుంది. నిజానికి మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూశాక సినిమా 50 రోజులు ఆడుతుంది అని అసలు అనుకోలేదు. మీ అందరి సపోర్ట్ కి పేరుపేరునా మా కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. ఇక చిత్ర డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ అఖండ విజయాన్ని నందమూరి తారక రామారావు గారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అఖండ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని అన్నారు. "సినిమా విడుదలకు ముందు చాలామంది థియేటర్లలో విడుదల చేయడం మంచిది కాదు అని అన్నారు. ఇది ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ రాయలసీమ, ప్యాన్ తెలంగాణ, లేక ప్యాన్ ఇండియన్ కాదు అఖండ పాన్ వరల్డ్ సినిమా" అని అన్నారు బాలయ్య.

Web TitleBalakrishna Speaks of Akhanda Pan World Cinema
Next Story