బోయపాటి సినిమాకి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే ?

బోయపాటి సినిమాకి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే ?
x
Balakrishna
Highlights

బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా

బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఈ సినిమాని మిరియాల రవీందర్ నిర్మిస్తున్నారు. సింహ, లెజెండ్ లాంటి హిట్ల తర్వాత ఈ కాంబినేషన్ నుండి సినిమా వస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి..

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నాడని టాక్.. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో కుటుంబ విలువలతో కూడుకున్న సన్నివేశాలతో బోయపాటి ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి గాను బాలయ్యకు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బోయపాటి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.రెమ్యునరేషన్ విషయంలో భాగంగానే ఈ సినిమా నుండి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని సమాచారం. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

మొత్తం ఈ సినిమా 70 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కుతునట్టు సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేదిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ రష్మికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓ కీలక పాత్ర కోసం బోయపాటి రష్మిని సంప్రదించాడని టాలీవుడ్ లో ఓ న్యూస్ హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటినటులను, సాంకేతిక నిపుణులని చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

ఇక బాలకృష్ణ హీరోగా రూలర్ అనే సినిమా తెరకెక్కి విడుదలకి సిద్దంగా ఉంది. కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. భూమిక, ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్యపాత్రలలో నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన బాలయ్య లుక్స్, సినిమా టీజర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. క్రిస్మస్ పండగకి కానుకగా సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జై సింహ సినిమా తర్వాత బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories