హిట్ పాటని బాలయ్య టైటిల్ గా మార్చేసిన డైరెక్టర్

Balakrishna Next Movie NBK 107 Title is Jai Balayya | Tollywood News
x

హిట్ పాటని బాలయ్య టైటిల్ గా మార్చేసిన డైరెక్టర్

Highlights

* "జై బాలయ్య" అనే టైటిల్ తో బాలకృష్ణ

NBK 107 Title: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరొక సినిమా "అఖండ". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ చిత్రం వీళ్లిద్దరి కెరీర్లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.

ముఖ్యంగా జై బాలయ్య పాట ఇప్పటికీ అభిమానులు నోట్లో నానుతోంది. ఇప్పుడు అదే పాటని టైటిల్ గా మార్చబోతున్నారు బాలకృష్ణ. ఈమధ్యనే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఎన్బీకే107 అంటూ అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు "జై బాలయ్య" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ కిక్ రాక్ సినిమాతో మంచి బ్లాక్బస్టర్ అందించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories