ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య...

ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య...
x
Highlights

ఫ్యాన్స్ కి బాలకృష్ణ దీపావళి గిఫ్ట్ ఇచ్చేసాడు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాకి రూలర్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్...

ఫ్యాన్స్ కి బాలకృష్ణ దీపావళి గిఫ్ట్ ఇచ్చేసాడు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాకి రూలర్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో బాలకృష్ణ ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలొ కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , భూమిక ఓ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ పై సీ కళ్యాణ్ సినిమాని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories