హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న బాలయ్య సినిమా

హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న బాలయ్య సినిమా

Rama Rao
Updated on: 3 Oct 2022 10:30 AM IST
Balakrishna Movie is Going to be a Hard Hitting Political Drama
X

హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న బాలయ్య సినిమా

Balakrishna Movie: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను కూడా ఒకరు. మిగతా హీరోలతో సినిమాల కంటే బోయపాటి బాలకృష్ణతో తీసిన సినిమాలే ఎక్కువ. 2010లో "సింహ" అనే సినిమాతో మొదలైన వీరిద్దరి కాంబో 2014లో "లెజెండ్" సినిమాతో కూడా రిపీట్ అయింది. మళ్ళీ ఈ మధ్యనే 2021లో "అఖండ" అనే సినిమాతో మళ్ళీ వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "సింహ", "లెజెండ్" వంటి సూపర్ హిట్ సినిమాల కంటే "అఖండ" సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఒక సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి మళ్లీ నాలుగవసారి బాలకృష్ణతో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు.తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ఒక హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని 2024 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ సినిమా విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ సుంకర నిర్మాతగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

ఇక వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2024 వేసవికాలంలో విడుదల కాబోతోంది. సాయి కొర్రపాటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం అన్స్టాప్పబుల్ అనే సెలబ్రిటీ టాక్ షో మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story