Balakrishna: బాలయ్య బాబు సింప్లిసిటీ.. అభిమానితో కలిసి భోజనం..

Balakrishna Lunch with His Fan Family | Tollywood
x

Balakrishna: బాలయ్య బాబు సింప్లిసిటీ.. అభిమానితో కలిసి భోజనం.. 

Highlights

Balakrishna: బాలయ్య బాబు సింప్లిసిటీ.. అభిమానితో కలిసి భోజనం..

Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ కు ఎంత కోపం ఉంటుందో అంతకు మించిన ప్రేమను ఆయన తోటివారిపై చూపిస్తారని అభిమానులు అంటూ ఉంటారు. ముక్కుసూటిగా , నిరాండభరంగా ఉండే బాలయ్య , తన సినిమా చిత్రీకరణ నిమిత్తం కర్నూలు వచ్చారు. షూటింగ్ అనంతరం ‌అక్కడి అభిమానులతో సమయాన్ని కేటాయించటం , వారి పట్ల పట్ల తన ప్రేమను చాటుకోవటం వార్తల్లో నిలిచింది.

ఆదోని కి చెందిన బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు స్వయంగా ఫోన్ చేసిన ఆయన కర్నూలుకు పిలిపించుకున్నారు. తాను ఉన్న హోటల్‌కు కుటుంబంతో సహా రావాల్సిందిగా అహ్వానించారు. అభిమాన హీరోనే ఫోన్ చేయడంతో సజ్జాద్ హుస్సేన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన కుటుంబంతో కలిసి బాలయ్య వద్దకు వచ్చాడు. వారిని బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories