మళ్లీ ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయాలనుకుంటున్న బాలకృష్ణ

Balakrishna is Planning to do a Movie in Boyapati Srinu Combination Again
x

మళ్లీ ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయాలనుకుంటున్న బాలకృష్ణ

Highlights

*మళ్లీ ఆ డైరెక్టర్ తోనే సినిమా చేయాలనుకుంటున్న బాలకృష్ణ

Balakrishna: ఈ మధ్యనే "అఖండ" సినిమాతో సీనియర్ హీరో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ" అంచనాలకు మించిన కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని తో సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాని సైన్ చేశారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతోందని బాలయ్య పాత్ర కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందని అనిల్ రావిపూడి అన్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మళ్లీ బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు నాలుగవ సినిమా గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బోయపాటి డైరెక్షన్ లో చేసిన ప్రతి సినిమా బాలకృష్ణ కి మర్చిపోలేని హిట్ గా మారింది. దీంతో బోయపాటి తో మళ్లీ ఈ సినిమా చేయడానికి బాలయ్య ఏమాత్రం అభ్యంతరాలు చెప్పడం లేదు. మరోవైపు బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories