మాస్ మహారాజా తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ

Balakrishna is planning a multistarrer with Ravi Teja
x

మాస్ మహారాజా తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ

Highlights

*మాస్ మహారాజా తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ

Balakrishna-Ravi Tej: ఈ మధ్యనే "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "క్రాక్" సినిమా తో సూపర్ హిట్ ను అందుకున్న గోపీ చంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణతో ఒక మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే తాజాగా బాలకృష్ణ ఒక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ మరియు రవితేజ హీరోలుగా ఒక మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు ఒక డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో కి గెస్ట్ గా వెళ్ళిన రవితేజ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories