Balakrishna: మరొకసారి ద్విపాత్రాభినయం చేయబోతున్న సీనియర్ హీరో

Balakrishna: యువ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ

admin1
Published on: 20 Jan 2022 11:24 AM IST
Balakrishna Double Action Movie with Director Gopichand Malineni | Tollywood News Today
X

మరొకసారి ద్విపాత్రాభినయం చేయబోతున్న సీనియర్ హీరో

Balakrishna: సీనియర్ హీరో బాలకృష్ణ ఈమధ్యనే "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. "సింహా", "లెజెండ్" వంటి సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా అఖండ. టైటిల్ కి తగ్గట్టు గానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఒక రైతుగా మరియు అఘోరాగా బాలకృష్ణ రెండు అవతారాల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ మరొకసారి ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఎన్బీకే107 అని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ఒక యువ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరియు ఒక ఒక ముసలివాడి పాత్రలో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story