మళ్ళీ ఎన్టీఆర్ పాత్రను చేయనున్న బాలయ్య ?

మళ్ళీ ఎన్టీఆర్ పాత్రను చేయనున్న బాలయ్య ?
x
Highlights

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందులో భాగంగానే తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా వెండితెరపైకి తీసుకురావలని...

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందులో భాగంగానే తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా వెండితెరపైకి తీసుకురావలని అయన తనయుడు బాలకృష్ణ చాలా ఇష్టంతో తానే నిర్మాతగా వ్యవహరించి ఎన్టీఆర్ బయోపిక్ ని తీశాడు. దీనిని కథానాయకుడు , మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తీశారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

అయితే ఇప్పుడు బాలకృష్ణ మళ్ళీ ఇదే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. తమిళ్ లో జయలలిత బయోపిక్ తలైవి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మెయిన్ రోల్ లో కంగన రనౌత్ కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కోసం చిత్ర యూనిట్ బాలయ్యనే అడిగారని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలకృష్ణ అచ్చు గుద్దినట్టు సరిపోవడంతో బాలకృష్ణ అయితేనే ఈ పాత్రకి న్యాయం చేస్తారని చిత్ర యూనిట్ భావిస్తుందట..

ఇదేకాకుండా ఈ చిత్ర నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఉన్నాడు. అయన ఎన్టీఆర్ బయోపిక్ కి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు.ఇవన్ని చూస్తుంటే మళ్ళీ బాలకృష్ణ ఎన్టీఆర్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories