Yellamma Movie: సాయిపల్లవి కోసం వేణు ఎదురుచూపులు..? ఇంతకీ ఎల్లమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

Yellamma Movie: సాయిపల్లవి కోసం వేణు ఎదురుచూపులు..? ఇంతకీ ఎల్లమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?
x
Highlights

ఎల్లమ్మ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవిని నటింప చేసేందుకు వేణు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు.

Yellamma Movie: టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంటుంది. ఇందుకు ఉదాహరణ వేణు ఎల్దండి. కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి టాలీవుడ్ మొత్తాన్ని ఫిదా చేశాడు. ఒకప్పుడు కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం సినిమా తర్వాత బలగం వేణుగా మారాడు.

వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమా చూసి ఏడ్వని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. తన నేటివిటీని వెండితెరపై చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే డైరెక్టర్‌గా అతని నెక్ట్స్ సినిమా ఏంటా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నానితో ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే నానికి వేరే కమిట్‌మెంట్స్ ఉండడంతో ఈ ప్రాజెక్టులోకి నితిన్ వచ్చాడు. ఎల్లమ్మ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవిని నటింప చేసేందుకు వేణు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో ఆమె డేట్స్ కేటాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది.

ఈ సినిమాలో సాయిపల్లవితోనే ఆ క్యారెక్టర్ చేయించాలని భావిస్తున్నారు వేణు. ఒకవేళ ఆమె కుదరని పరిస్థితుల్లో సంయుక్త మీనన్ సహా మరికొంతమంది హీరోయిన్లను పరిశీలించాలని అనుకుంటారని టాక్. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రం కోసం క్రేజీ టెక్నీషియన్స్‌ను తీసుకున్నాడు వేణు. ఈ సినిమాకి మ్యూజికల్ డ్యూయో అజయ్- అతుల్ సంగీతం అందించబోతున్నారు. ఈ విషయాన్ని గతంలోనే అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం వేణు ఆ ఇద్దరితో కలిసి ముంబైలో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నాడు. ఇక ఎల్లమ్మ సినిమాను కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందించబోతున్నాడు వేణు. ఓ రకంగా కాంతార అంత ఇంపాక్ట్ ఈ కథలో ఉందనే గాసిప్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ ఫైనల్ అయిన తర్వాత అధికారిక ప్రకటన చేసి సినిమాని పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories