గోపీచంద్ మలినేని - బాలయ్య టైటిల్ అదేనా?

Bala Krishna Movie Title Name Reddy Garu | Tollywood
x

గోపీచంద్ మలినేని - బాలయ్య టైటిల్ అదేనా?

Highlights

Bala Krishna: "రెడ్డి గారు" అనే టైటిల్ తో బాలకృష్ణ

Bala Krishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే "అఖండ" సినిమాతో హిట్ అందుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుని బాలయ్య కెరీర్లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈమధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఎన్బీకే107 అంటూ అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమా లో ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈనెల 10వ తేదీన బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా టీజర్ ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ టీజ‌ర్‌ తోనే టైటిల్ కూడా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి "అన్న‌గారు", "వీర సింహారెడ్డి" లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సినిమాకి "రెడ్డిగారు" అనే టైటిల్ ని దాదాపుగా ఖాయం చేసేసిన‌ట్టు స‌మాచారం. ఇదే టైటిల్ ని పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజర్ తో పాటు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories