మరొక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్న బాహుబలి డైరెక్టర్ ?

Bahubali Director is Planning Another Big Movie?
x

మరొక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్న బాహుబలి డైరెక్టర్ ?

Highlights

Rajamouli: మరొక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్న బాహుబలి డైరెక్టర్?

Rajamouli: "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక క్లాసిక్ సినిమా ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి మిగతా డైరెక్టర్లతో పోటీ పడకుండా తన సినిమాల రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ ప్రతి సినిమాతో కొత్త బార్ ని సెట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాని మొదలు పెట్టనున్నారు మహేష్ బాబు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఏ విధంగా చూసినా సరే మహేష్ బాబు రాజమౌళి సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబోతోంది. "ఆర్ ఆర్ ఆర్" తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఒక భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నారు. వెండి తెరపై మరొకసారి విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. "బాహుబలి" రేంజి గ్రాఫిక్స్ "ఆర్ ఆర్ ఆర్" లో లేవని కొందరు అన్నారు. ఈ సినిమా వారికి గట్టి సమాధానం ఇచ్చేలా ఉండచ్చు.

రాజమౌళి నుంచి రాబోయే సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తారని కూడా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories