బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

Bahubali 2 Movie Records Breaking  RRR Movie | Telugu Movie News
x

 బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

Highlights

*బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తున్న "ఆర్ ఆర్ ఆర్"

RRR-Babhubali: ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఎట్టకేలకు మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాగా మరియు మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది అని అభిమానులు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు మీద రికార్డులు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ తో "ఆర్ ఆర్ ఆర్" సినిమా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.బాహుబలి2 ప్రీమియర్స్ తో 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేయగా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఇపుడు 2.5 మిలియన్ డాలర్లతో బాహుబలి 2 రికార్డులను తిరగరాసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు.

ఇప్పటికే కొన్ని చిన్న థియేటర్లలో అభిమానులు చేసే సందడికి కంగారుపడి స్క్రీన్ పాడవకుండా కొన్ని థియేటర్లలో కంచెలు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక మరి కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని థియేటర్ల వద్ద సినిమా టికెట్లను బ్లాక్ చేస్తున్నారు అంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories