Theaters: సినీ ఇండస్ట్రీకి బ్యాడ్ న్యూస్

Bad news To Telugu Cinema Industry
x

సినిమా థియేటర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Theaters: కరోనా కేసులు పెరగడమే అందుకు కారణామా..? * మార్చిలో విడుదల సిద్ధంగా ఉన్న సినిమాలు

Theaters: సినీ ఇండస్ట్రీకి ఓ బ్యాడ్ న్యూస్.. లాక్‌డౌన్ వల్ల భారీ నష్టాలు చవిచూసిన టాలీవుడ్‌కి. ప్రస్తుత పరిస్థితులు దర్శకనిర్మాతలకు గుబులు పుట్టిస్తున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రేక్షకులు లేక థియేటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డనట్టుగా ఉంది టాలీవుడ్ పరిస్థితి లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు నిండుతాయనుకుంటే. ఆ పరిస్థితి లేదు. వరుస విజయాలతో మెల్లగా గాడిలో పడిందనుకున్నట్టు సమయంలో మరో పిడుగు పడింది. ఇటీవల పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే.. ప్రేక్షకులు రాక థియేటర్లు వెలవెలబోతున్నాయి.

లాక్‌డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీకి గత నెలలో వరుస విజయాలు కొద్దిగా జోష్ నిచ్చాయి. అదే ఉత్సాహంతో బడ్జెట్, మినిమం బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. ఈ నెల ఫస్ట్ వీక్‌లో పది చిన్న సినిమాలు రిలీజ్ అయి సక్సెస్ అయ్యాయి. సినిమాలు బాగున్నా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు కరువయ్యారు.

మార్చి సెకండ్ వీక్‌లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య చాలానే ఉంది. అంతేకాదు.. మరోవైపు కరోనా కేసులు పెరగడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. జనాలు లేక థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories