Love Me If You Dare OTT: ఓటీటీలోకి వచ్చేసిన.. బేబీ హీరోయిన్‌ కొత్త సినిమా, ఎక్కడ చూడొచ్చంటే..!

Love Me If You Dare OTT: ఓటీటీల రాకతో కొత్త సినిమాలు కూడా త్వరగా డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తున్నాయి.

Baby Movie Fame Actress Vaishnavi Chaitanya Latest Movie Love Me Streaming in Amazon Prime
X

Love Me: ఓటీటీలోకి వచ్చేసిన.. బేబీ హీరోయిన్‌ కొత్త సినిమా, ఎక్కడ చూడొచ్చంటే..!

Love Me If You Dare OTT: ఓటీటీల రాకతో కొత్త సినిమాలు కూడా త్వరగా డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కొత్త సినిమానే ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

బేబీ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న అందాల తార వైష్ణవి చైతన్య నటించిన చిత్రం లవ్‌మీ. బేబే సక్సెస్‌ తర్వాత వచ్చిన చిత్రం కావడం, ఇది కూడా ప్రేమ నేపథ్యంలోనే తెరకెక్కడంతో 'లవ్‌మీ' మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. బడా నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీకి చెందిన ఆశీస్‌ హీరోగా నటించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కిరణ్‌ భీమవరం తెరకెక్కించిన ఈ సినిమా మే25వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్‌ను మాత్రం కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తొలుత ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. దీంతో సినీ లవర్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్‌ (ఆశిష్‌)కు దెయ్యాలపై నమ్మకం ఉండదు. ఎవరైనా దెయ్యం ఉందని చెప్పగానే అక్కడికి వెళ్లి అవి లేవని సాక్ష్యాధారాలతో నిరూపిస్తుంటాడు. ఇదే సమయంలో ప్రియ (వైష్ణవి చైతన్య) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. దీంతో అర్జున్‌ ఎలాగైనా ఆ దెయ్యం గుట్టు విప్పాలని ప్రయాణం మొదలు పెడతాడు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.? ఇంతకీ దివ్యవతి కథెంటీ అన్న అంశాలతో ఈ సినిమానె తెరకెక్కించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story