మెగాస్టార్ పై బాబు మోహన్ ఘాటు విమర్శలు...

మెగాస్టార్ పై బాబు మోహన్ ఘాటు విమర్శలు...
x
Highlights

సినిమాలో హీరో గురించి చెబుతూ బాబు మోహన్ ఫ్లోలో చిరంజీవిని తీసుకువచ్చారు, వాస్తవానికి బాబూమోహన్ కి చిరంజీవి అంటే మంచి అభిమానమే..

ప్రసంగాల్లో, సభలలో నేతలు, సినిమా నటులు నోరు జారడం అనేది కామన్ .. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. హాస్యనటుడు మరియు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అలాగే నోరు జారారు. బాలకృష్ణ హీరోగా వచ్చినా భైరవద్వీపం సినిమా షూటింగ్ లోని రోజులను గుర్తు చేసుకుంటూ హీరో బాలకృష్ణని తెగ పొగిడేశారు బాబు మోహన్.. ఈ సినిమాలో బాబు మోహన్ ఓ పాత్రలో నటించారు. అయితే ఈ పొగిడే ప్రాసెస్ లో అయన మెగాస్టార్ పై నోరు పారేసుకున్నారు.

ఆ సినిమాలో బాలకృష్ణ, నేను గర్రాలపై వెళ్తాం. బాలకృష్ణ మొనగాడు గుర్రం నడపడంలో... ఆడతాడు గుర్రాలతో ఎగిరి దూకుతుంటాడు వాటి మీదికి.... నిజంగా బాలకృష్ణలా ఎవ్వరూ చేయలేరని చెబుతూ అందులోకి చిరంజీవి పేరును ప్రస్తావించారు బాబుమోహన్.. ఆయన గుర్రపు స్వారీలో బాలకృష్ణను మించిన వారులేరంటూనే..చిరంజీవి అందుకు పనికిరారు అని అర్థం వచ్చేలా మాట్లాడేశారు. బాబూ మోహన్ చెప్పేదంతా అక్కడున్నవారు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇదంతా ఓ వీడియోలో రికార్ఢు అయింది. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలీదు కానీ, తాజాగా బయటికి వచ్చేసింది.ఇప్పుడు బాబూ మోహన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో హీరో గురించి చెబుతూ బాబు మోహన్ ఫ్లోలో చిరంజీవిని తీసుకువచ్చారు, వాస్తవానికి బాబూమోహన్ కి చిరంజీవి అంటే మంచి అభిమానమే.. చాలా సార్లు మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు బాబు మోహన్ కానీ ఇప్పుడు ఇలా అనడంతో అభిమానులు అయనపై ఫైర్ అవుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories