Ay Pilla Lyrics: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న 'ఏయ్ పిల్ల' సాంగ్

Ay Pilla Lyrics: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ఏయ్ పిల్ల సాంగ్
x
Ay Pilla song
Highlights

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో సిద్దహస్తుడు అయిన శేఖర్ కమ్ముల ఈ సినిమాను కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.

హోలీ సందర్భంగా నిన్న విడుదల చేసిన 'ఏయ్ పిల్లా ఫుల్ లిరిక‌ల్‌ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పింగళి చైతన్య సాహిత్యం అందించగా, ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందించాడు. హరిచరణ్ తన గాత్రాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంట చాలా క్యుట్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కరోజులోనే పది లక్షలు వ్యూస్ ని అందుకుంది. చూస్తుంటే మరిన్ని వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాని ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

పరుశురాంతో చైతూ :

ఈ సినిమా తరవాత గీతా గోవిందం ఫేం పరుశురాంతో ఓ సినిమాని చేయనున్నాడు నాగచైతన్య.. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. రష్మిక మందన్నా కథానాయకగా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్లనుంది. ఈ సినిమాకి నాగేశ్వర్ రావు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories