బిగ్‌బాస్‌ హౌస్‌కు అవినాష్‌ పాదాభివందనం!

బిగ్‌బాస్‌ హౌస్‌కు అవినాష్‌ పాదాభివందనం!
x
Highlights

ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి డ్యాన్సులు చేశారు. అవినాష్‌, అరియానా జోడీ రొమాంటిక్‌ డోసు పెంచి మరీ స్టెప్పులేశారు. అటు అభిజిత్‌-హారిక కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించారు.

సన్‌డే రోజు ఫన్‌డే గడిచింది బిగ్‌బాస్‌ హౌస్‌. నాగార్జున ఇంటిసభ్యులకు ఇచ్చిన "యారోంకా యార్‌" టాస్క్‌ నవ్వులను పూయించింది. టాస్క్‌లో విన్‌ అయిన సోహైల్‌ "అందరి బంధువయ" సాష్‌ను అందుకున్నాడు. అటు అవినాష్‌ మనసుకు తాకిన గాయాలను తట్టి లేపారు నాగార్జున.

కంటెస్టెంట్లకు ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసనేది పరీక్షించేందుకు నాగ్‌ "యారోంకా యార్‌" అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఒక్కో కంటెస్టెంటును నిల్చోమని చెప్పి నాగ్‌ మూడు ప్రశ్నలు అడుగుతారు. దానికి సందరు కంటెస్టెంటుతోపాటు మిగతా ఇంటి సభ్యులు కూడా సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఎవరు కరెక్ట్‌గా చెప్తే వారికి గులాబీలు ఇవ్వాల్సి ఉంటుంది.

"యారోంకా యార్‌" టాస్క్‌లో ఎక్కువ మంది గురించి సరైన జవాబులు చెప్పిన సోహైల్‌కు ఎక్కువ గులాబీలు రావడంతో అతడు గెలిచాడు. రన్నరప్‌గా నిలిచిన హారిక అందరి బంధువయ సాష్‌ను సోహైల్‌ భుజాన వేసింది. నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులు తమని కాపాడమంటూ ఆవును వేడుకున్నారు. అవినాష్‌ ప్రయత్నాలకు చలించని ఆ కామధేనువు అభిజిత్‌ అభ్యర్థించగానే అంబా అని అరిచి అతడిని సేవ్‌ చేసింది.

ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి డ్యాన్సులు చేశారు. అవినాష్‌, అరియానా జోడీ రొమాంటిక్‌ డోసు పెంచి మరీ స్టెప్పులేశారు. అటు అభిజిత్‌-హారిక కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ఇక మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ద సీజన్‌ బిరుదు అందుకున్న అవినాష్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఇంటిసభ‌్యులతో.. నాగార్జున మరో గేమ్‌ ఆడించారు. మొదట హారిక.. ప్యూర్‌లీ ప్రేమను మోనాల్‌కు అంకితం చేసింది. తర్వాత అఖిల్‌ ఎనర్జీ బీట్స్‌ ప్లే బోర్డ‌్‌కు బంతి కొట్టడంతో గ్యాంగ్‌ లీడర్‌ సాంగ్‌కు సోహైల్‌తో కలిసి స్టెప్పులేశాడు. సోహైల్‌ టాలీవుడ్‌ హంక్స్‌ను సెలక్ట్‌ చేసుకోగా రావాణా.. జైజైజైజై సాంగ్‌కు రాక్షసంగా డ్యాన్స్‌ చేశారు.

అరియానా దోస్తు మేరా దోస్త్ ప్లే బోర్డ్‌ను ఎంపిక చేసుకుని అవినాష్‌తో చిందేసింది. ఇక అవినాష్‌ సామజవరగమన పాటకు అరియానాను ఎత్తుకుని మరీ రొమాన్స్‌ చేశాడు. అభిజిత్‌ పార్టీ టైమ్‌ అంటూ సోహైల్‌తో చిందులేశాడు. మోనాల్‌ మాత్రం అఖిల్‌, హారిక ఇద్దరితో కలిసి డ్యాన్స్‌ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది.అఖిల్‌ లవ్‌ ఎక్కువ కావాలి అని మోనాల్‌ ఆనందంతో మనసులోని మాటను బయటకు చెప్పేయడంతో అఖిల్‌ ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. రొమాన్స్‌ జోనర్‌లో అభితో డ్యాన్స్‌ చేయాలనుందని హారిక మనసులోని మాటను చెప్పగా ఆమెకోసం స్పెషల్‌ సాంగ్‌ వేయించడంతో అభిక జోడీ కలిసి డ్యాన్స్‌ చేశారు. తర్వాత హారిక సేవ్‌ అయినట్లు నాగ్‌ వెల్లడించగా.. ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అనంతరం మోనాల్‌ సేవ్‌ అవగా అవినాష్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

తను ఎప్పుడూ వీక్‌ అని పదేపదే నొక్కి చెప్పే మోనాల్‌ను తొలిసారి స్ట్రాంగ్‌ అని పేర్కొంటూ ఇంటిసభ్యులతో సెలవు తీసుకున్నాడు అవినాష్‌. మనసులోని దు:ఖాన్ని లోపలే అణిచివేసి అందరికీ నవ్వులు పంచాడు. ఫైనల్‌గా బిగ్‌బాంబ్‌ను అభిజిత్‌ మీద వేసి.. అవినాష్‌ హౌస్‌ నుండి నిష్క్రమించాడు.బిగ్‌బాస్‌ హౌస్‌కు పాదాభివందనం చేసిన అవినాష్‌.. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. మోనాల్‌ స్ట్రాంగ్‌ అని చెప్తూ కన్నీళ్లను దిగమింగుకున్నాడు. ఇక స్టేజీ మీదకు వచ్చిన అవినాష్‌కు బిగ్‌బాస్‌ హౌస్‌లో అవినాష్‌ చేసిన జర్నీ చూపించారు నాగ్‌.

బిగ్‌బాస్‌ స్టేజ్‌పై అవినాష్‌ అందరి మీద మిమిక్రీ చేసి నవ్వించాడు. కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్న అరియానాను మాత్రం నవ్వించలేకపోయాడు. నోకోసం ఎదురు చూస్తుంటానని, ఏడవొద్దని ఆమెను ఊరడించాడు. అరియానాను నవ్వించాల్సిందేనని నాగ్‌ పట్టుపట్టడంతో ఆమెను ఇమిటేట్‌ చేసి ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చాడు.ఫైనల్‌గా హౌస్‌లో వారం రోజులు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదన్న బిగ్‌బాంబ్‌ను అవినాష్‌.. అభిజిత్‌ మీద వేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories