అరియాన గ్లోరితో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అవినాష్

అరియాన గ్లోరితో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అవినాష్
x
Highlights

షోలో తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్నరూమర్స్ పై పెదవి విప్పాడు.

ఇటీవల ముగిసిన రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్ 4 తర్వాత కంటెస్టెంట్స్‌ అంతా టీవీ, న్యూస్‌ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా గడుపుతున్నారు. జబర్థస్త్‌ అవినాష్‌ బిగ్‌బాస్‌ హౌస్ లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్నషోను మరింత రక్తికట్టించారు. అంతే కాకుండా తన మార్క్ కామెడీతో అలరించాడు. అదే విధంగా అవినాష్‌ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయాడు. షోలో తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్నరూమర్స్ పై పెదవి విప్పాడు. అరియాన గ్లోరితో పెళ్లి వార్తలు పుకార్లు అని చెప్పాడు.

అయితే అవినాష‌్ జబర్థస్త్‌ కాంట్రాక్ట్‌ ఒప్పందాన్ని బ్రేక్‌ చేసిన విషయం తెలిసిందే. అవినాష్‌ జబర్థస్త్‌ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు పది లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్‌బాస్‌ షో ద్వారా అవినాష్‌ బాగానే లాభపడినట్లు సమాచారం. బిగ్‌బాస్‌తో డబ్బులు భారీ మొత్తంలో అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను బీజీగా ఉన్ననని దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు అవినాష్ వెల్లడించాడు. అనిల్‌ రావిపూడి ఫైనల్లో ముఖ్య అతిథిగా అడుగుపెట్టి టాప్‌ ఐదుగురిలో ఒకరిని ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories