మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు రేపు 'మైండ్‌ బ్లాక్‌' గ్యారంటీ అంటున్న వార్నర్

మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు రేపు మైండ్‌ బ్లాక్‌ గ్యారంటీ అంటున్న వార్నర్
x
David warner, mahesh babu(file photo)
Highlights

ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై రేపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు.

ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై రేపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు. కరోనా వ్యాప్తి లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగుపై అభిమానంతో టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. సతీమణి క్యాండిస్‌తో అందరి హీరోల పాటలకు స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు.

ఇదివరకే బన్నీ నటించిన అలవైకుంఠపురంలో.. సినిమాలోని 'రాములో రాములా'‌తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో పాటలకు భార్యతో కలిసి స్టెప్పులు వేసాడు. మహేష్ పోకిరి, ప్రభాస్ బాహుబలి మూవీ డైలాగ్స్‌తో మెప్పించాడు. కాగా.. పలువురు హీరోల అభిమానులు వార్నర్‌కు స్పెషల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్‌కు డాన్స్ చేసి ఎన్టీఆర్ కు బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు.

మహేశ్ బాబు ఫ్యాన్స్ కోరిక మేరకు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్‌బ్లాక్' పాటకి టిక్‌-టాక్ చేసి అలరించాడు. డాన్స్ చేయలేదు. మైండ్‌ బ్లాక్‌' సాంగ్‌కు టిక్‌టాక్‌ అని చెప్పకుండా సర్‌ప్రైజ్‌ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్‌ ఇచ్చాడు. వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ టిక్‌టాక్‌కు ఆ మూవీ హీరోయిన్ రష్మిక మందన్న ఫిదా అయిన విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్‌పై రష్మిక మందన్న ప్రశంసల జల్లు కురిపించింది. మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో బాబు వాడిని కొట్ట‌మ‌ని చెప్పు అనే పదాలకు టిక్ టాక్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories