అడుగడుగో యాక్షన్ హీరో.. రూలర్ సాంగ్

అడుగడుగో యాక్షన్ హీరో.. రూలర్ సాంగ్
x
నందమూరి బాలకృష్ణ
Highlights

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్ర బృంధం విడుదల చేసింది. అడుగడుగో యాక్షన్ హీరో అరే దేఖో యారో.. అనే పాటను ఆదివారం విడుదల చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నపాత్రల్లో నటించారు. ఈ నెల 20వ తేదీనా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా ఉన్నారు. రామజోగయ్య శాస్త్రి రాసినా ఈ గేయానికి చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. సాయిచ‌ర‌ణ్ పాటను ఆలపించారు.

ఇటీవలి రిలీజ్ అయినా టీజర్ వీక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసి ఈ లిరికల్ సాంగ్ అచ్చు బాలకృష్ణ మెనరిజం ఈ పాటలో తెలియజేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. బాలకృష్ణకు జైసింహా చిత్రంలో సూపర్ హిట్ అందించిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories