అనంతపురంలో వెంకీ అసురన్

అనంతపురంలో వెంకీ అసురన్
x
Venkatesh
Highlights

గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ సినిమాలతో అదరగొట్టాడు హీరో వెంకటేష్.. ఇప్పుడు తమిళ్ లో మంచి హిట్టు అయిన 'అసురన్‌' సినిమాని తెలుగలో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ...

గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ సినిమాలతో అదరగొట్టాడు హీరో వెంకటేష్.. ఇప్పుడు తమిళ్ లో మంచి హిట్టు అయిన 'అసురన్‌' సినిమాని తెలుగలో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ ఈ సినిమాని ధనుష్ చేయగా వెట్రి మారన్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ధనుష్‌. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ధనుష్ సరసన మంజు వార్యర్ హీరోయిన్ గా నటించింది.

అక్కడ మంచి హిట్టు కావడంతో ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకటేశ్‌ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జనవరి 20 నుంచి మొదలు పెట్టనున్నారట.

ఈ సినిమాను ఎక్కువ భాగాన్ని అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే వీటికోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా నిర్మిచారట! ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాని కలైపులి యస్‌.థాను, సురేశ్‌బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories