మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఆ విశ్వక్ సేన్

Ashokavanamlo Arjuna Kalyanam successfully completed weekend
x

విజయవంతంగా వారాంతం పూర్తిచేసుకోనున్న "అశోకవనంలో అర్జున కళ్యాణం"

Highlights

Vishwak Sen: మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఆ విశ్వక్ సేన్

Vishwak Sen: "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో యువహీరో విశ్వక్ సేన్ మరొక హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. రొమాంటిక్ కామెడీ సినిమాగా కొత్త డైరెక్టర్ విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో మే 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. విడుదలకు ముందు విశ్వక్ సేన్ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ అవేమీ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించలేదు. నిజానికి అవన్నీ ఈ సినిమాకి హైప్ మరింత పెంచాయని చెప్పుకోవచ్చు. రుక్సార్ ధిల్లాన్ మరియు రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేశారు.

సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమా వారాంతం పూర్తయ్యేలోపు మంచి కలెక్షన్లు అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిట్ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కెరియర్ లో మరొక మళ్లీ మైలురాయిగా ఈ సినిమా నిలవనుంది. గోపరాజు రమణ, కాదంబరి కిరణ్, కేదార్ శంకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పతాకంపై బి బాపినీడు మరియు సుదీర్ ఎదర ఈ సినిమాని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories