Ashika Ranganath: ప్రభాస్ తో డాన్స్ వేయనున్న శాండల్ వుడ్ భామ

Ashika Ranganath Dance with Hero Prabhas in Salaar Movie | Telugu Movie News
x

ప్రభాస్ తో డాన్స్ వేయనున్న శాండల్ వుడ్ భామ

Highlights

Ashika Ranganath: "సలార్" కోసం స్టెప్పులెయ్యనున్న కన్నడ బ్యూటీ

Ashika Ranganath: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ సినిమా ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం ఒక కన్నడ బ్యూటీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతోంది. ఆమె ఎవరో కాదు అషిక రంగనాథ్. "మాస్ లీడర్", "రాంబో 2", "మధగజ" సినిమాలతో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన అషికా ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమా "సలార్" లో తన డాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories