Top
logo

పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
X
Highlights

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై...

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను మళ్లీ వెండి తెరపై చూడాలని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు ఒక స్క్రిప్ట్ వినిపించడానికి వెళ్లాడాని వార్తలు బయటకు రాగానే అందరిలోనూ మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే తాజాగా వైరల్ గా మారుతున్న ఆ వార్తల పైన హరీష్ శంకర్ ఎట్టకేలకు నోరు విప్పాడు.

పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పిన హరీష్ శంకర్ తను పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ వినిపించలేదని, అసలు పవన్ ను కనీసం కలవలేదు కూడా అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. మరోవైపు హరీష్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా తమిళ సినిమా 'జిగర్తాండ' రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే రెమ్యూనరేషన్ పై వచ్చిన వార్తలను కూడా కొట్టిపారేశారు హరీష్ శంకర్.

Next Story