Arjun Son Of Vyjayanthi Box Office Collection Day 1: ఏంటీ భయ్యా ఈ కలెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.. అర్జున్ స‌న్ ఆఫ్ వైజ‌యంతి తొలి రోజు వ‌సూళ్లు ఎంతో తెలుసా?

Arjun Son Of Vyjayanthi Box Office Collection Day 1
x

ఏంటీ భయ్యా ఈ కలెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.. అర్జున్ స‌న్ ఆఫ్ వైజ‌యంతి తొలి రోజు వ‌సూళ్లు ఎంతో తెలుసా? 

Highlights

Arjun Son Of Vyjayanthi Box Office Collection Day 1: ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలక పాత్రలో, కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’.

Arjun Son Of Vyjayanthi Box Office Collection

Arjun Son Of Vyjayanthi Box Office Collection Day 1: ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలక పాత్రలో, కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. మొద‌టి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ ఏర్ప‌డ్డ విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత విజ‌యశాంతి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పాజిటివ్ బ‌జ్‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అర్జున్ స‌న్ ఆఫ్ వైజ‌యంతి ఆశించిన స్థాయిలో మాత్రం టాక్‌ను అందుకోలేక‌పోయింద‌ని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు కేవ‌లం రూ. 5.15 కోట్లు గ్రాస్, రూ. 2.50 కోట్లు షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువ స్థాయి వసూళ్లే కావడం గ‌మ‌నార్హం. అయితే తొలి రోజు వ‌సూళ్లు బాగాలేక‌పోయినా ఈ సినిమాకు శని, ఆదివారాల్లో కలెక్షన్లు మెరుగ్గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు.

పోటీలో మ‌రే సినిమా లేక‌పోవ‌డంతో వ‌సూళ్లు మెరుగ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రూ. 21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకోగా, సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ. 19.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి వారం ముగిసే సరికి ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందా? లేదా వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఐపీఎస్ కావాలని కలలు కనే అర్జున్ అనుకోని పరిస్థితుల వల్ల ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడు, అతడి తల్లి వైజయంతి ఒక ఐపీఎస్ అధికారిణిగా తన కుమారుడి మారిన ప్రవర్తనతో ఎలా పోరాడింది, చివరకు తల్లి కోసం అర్జున్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? అనేదే ఈ సినిమా క‌థ‌. ఇందులో క‌ళ్యాణ్ రామ్‌కు జోడిగా సాయి మంజ్రేకర్ న‌టించ‌గా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో విలన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. నటుడు శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories