Harish Shankar - Sai Dharam: ఎడిటర్ తో వాగ్వివాదానికి దిగిన హరీష్ శంకర్

Argument Between Harish Shankar and News Channel Editor About Sai Dharam Tej Accident News
x

Harish Shankar - Sai Dharam: ఎడిటర్ తో వాగ్వివాదానికి దిగిన హరీష్ శంకర్

Highlights

Harish Shankar: హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న కొందరికి అన్నం పెడుతున్నావ్ తమ్ముడు

Sai Dharam - Harish Shankar: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి ఈ మధ్యనే పెద్ద ఏక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు సాయితేజ్. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మీడియా పై వస్తున్న పుకార్లపై ఘాటుగా స్పందించారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఎడిటర్ కి మరియు హరీష్ శంకర్ కి మధ్య వాగ్వివాదం జరిగింది. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న కొందరికి అన్నం పెడుతున్నావ్ తమ్ముడు నీకు హాండ్స్ హాట్సాఫ్ అంటూ హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేశారు.

కాగా "మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషనైపోయింది, తప్పుడు కథలను, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించొచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ మీడియానే తప్పు పడతారు, మీరు ప్రమాదానికి గురి కావడంతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా బలి చేస్తున్నారు" అంటూ ఒక ఎడిటర్ రిప్లై ఇచ్చారు.

దీంతో మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ విమర్శించిన హరీష్ శంకర్ తమకు సెన్సార్ ఉందని మరి మీడియాకి ఏముందని అడిగారు. ఒక జర్నలిస్ట్ గా తను ఒక ప్రశ్నించే గొంతు అని, ఇక సెన్సార్ ఎలా చేస్తారో మెంబర్ గా తనకి తెలుసు అని జవాబిచ్చారు. దానికి హరీష్ శంకర్ తమ సినిమాలలో సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితం అని తాము వేస్తామని అలాగే న్యూస్ కూడా కల్పితమని చెబితే జనాలకి క్లారిటీ ఉంటుందని అన్నారు.

"ఆడవాళ్లకు సగం గుడ్డలు వేసి అశ్లీల డాన్సులు చేస్తూ సినిమాలు తీసి సభ్యసమాజంలో వదులుతారు. సెక్స్ సీన్స్ చూపించి పవిత్రమైన యోగా అని అంటారు. న్యూస్ చూసి నేరాలు చేసిన దాఖలాలు లేవు. కానీ సినిమాలు సమాజం పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అని మీకు తెలియడం లేదా? అసలు జర్నలిజం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?" అని అన్న ఎడిటర్ పవన్ కళ్యాణ్ తో తన తర్వాత సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపి ఈ వివాదాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. హరీష్ శంకర్ కూడా సర్వేజనా సుఖినోభవంతు అంటూ ఆ వివాదాన్ని పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories