కేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధ‌వ‌న్‌పై ఏఆర్ రెహమాన్ ప్ర‌శంస‌లు

Rahman comments on Madhavan movie
x

మాధవన్ సినిమాపై రెహమాన్ కామెంట్లు

Highlights

Rahman: తన విలక్షణ నటనతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ని సొంతం చేసుకున్న నటుడు మాధవన్.

Rahman: తన విలక్షణ నటనతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ని సొంతం చేసుకున్న నటుడు మాధవన్. నటుడిగా ఎన్నో సార్లు తన సత్తా చాటి ఎన్నో అవార్డులు కూడా అందుకున్న మాధవన్ తాజాగా ఇప్పుడు డైరెక్టర్ గా కూడా మారారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా మాధవన్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్". తెలుగు తమిళ భాషల్లో హీరో సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ వెర్షన్ లో ఆ పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

తాజాగా ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు మాధవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఆస్కార్ విన్నర్ అయిన ఏ ఆర్ రెహమాన్ కూడా తనదైన స్టైల్ లో పొగడ్తల వర్షం కురిపించారు. "కేన్స్ లో ఇప్పుడే రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమా చూశాను. కొత్త పిలుపుని కొత్తదనాన్ని ఇండియన్ సినిమాకి పరిచయం చేశారు" అంటూ #changeishere #respectindianscientists అంటూ హాష్ ట్యాగ్ లు యాడ్ చేశారు. ఇక మాధవన్ మాట్లాడుతూ "సైన్స్ అండ్ టెక్నాలజీ తో అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తులను సినీ నిర్మాతలు గుర్తించడంలేదు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమా అర్థం కాదు ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజానికి ఆయన తీసిన ఇన్సెప్షన్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ ఆయనకి సైన్స్ పై ఉన్న జ్ఞానం వల్ల ఆయన పై నాకు చాలా గౌరవం ఉంది" అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories