ఏఆర్. మురుగదాస్‌ మల్టీస్టారర్‌ మూవీలో హీరోలు ఎవరంటే..?

AR Murugadoss Plans Cast Mahesh Babu and Kamal Hassan Multi Starrer Movie
x

ఏఆర్. మురుగదాస్‌ (ఫొటో ట్విట్టర్)

Highlights

AR Murugadoss: ఈ మధ్య టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లో సినిమాలు ఎక్కువయ్యాయి.

AR Murugadoss: ఈ మధ్య టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లో సినిమాలు ఎక్కువయ్యాయి. అలాగే పరిశ్రమలతో కూడా సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలకు పలు భాషల డైరెక్టర్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తో ప్రభాస్‌ 'సలార్‌' మూవీ చే. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో డైరెక్టర్ శంకర్ ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కించునున్నాడు. అయితే, తాజాగా మరో క్రీజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమైనట్లు నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.

క్రియోటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కించునున్నాడంట. ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌కు స్టోరీ లైన్ కూడా సిద్ధం చేశాడంట మురుగదాస్. కాగా, ఈ సినిమాలో మహేశ్‌ బాబు సీబీఐ ఆఫీసర్‌గా, కమల్ హాసన్‌ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై న్యూస్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మురుగుదాస్‌ గ‌తంలో మ‌హేశ్‌ బాబుతో స్పైడ‌ర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories