వెబ్ సిరీస్ భామతో తో ఐటెం సాంగ్ చేస్తున్న రవితేజ

Anveshi Jain Item Song in Ravi Teja Ramarao On Duty Film
x

వెబ్ సిరీస్ భామతో తో ఐటెం సాంగ్ చేస్తున్న రవితేజ

Highlights

"గందీ బాత్" బ్యూటీతో స్టెప్పులెయ్యబోతున్న రవితేజ

Ravi Teja Film: వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యన ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు రవితేజ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "మజిలీ" ఫేమ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. రజిషా విజయన్, నాజర్, పవిత్ర లోకేష్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అన్వేషి జైన్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. హిందీ లో ఒకటి రెండు సినిమాలు మరియు వెబ్ సిరీస్ చేసిన అన్వేషి జైన్ "గందీ బాత్" వెబ్ సిరీస్ తో సోషల్ మీడియాలో కూడా ఈ భామ ఇప్పుడు రవితేజతో కలిసి ఒక ఐటమ్ సాంగ్ చేయబోతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సామ్ సీ ఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories