
అనుష్క పెళ్లిపై వేస్తున్న ప్రశ్నలు తరచూ ఆమెను విసిగిస్తున్నాయి. కాగా.. అనుష్క ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడిని త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క తన నటనతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ భాషలలో చిత్రాలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఒక అగ్ర కథానాయకుడికి ఉన్న క్రేజ్ ఈ అమ్మడికి ఉంది. హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు అలోచించే దర్శకులకు ముందు అనుష్కనే గుర్తుకు వస్తుంది. ఈ స్వీటీతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలోనూ నిర్మాతలు వెనుకడుగు వేయ్యరు. అనుష్క చిత్ర సీమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు గడిచింది.
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' చిత్రం తో అనుష్క తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయింది. కెరీర్ మొదట్లోనే రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ళయింది. ఈ పదినేళ్ళలో అమ్మడు ఎన్నో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
తన పెళ్లిపై వేస్తున్న ప్రశ్నలు తరచూ ఆమెను విసిగిస్తున్నాయి. కాగా.. అనుష్క ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడిని త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుష్క పెళ్లి వార్తలపై స్పందించారు. అనుష్క ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసి 15 సంవత్సరాలైన సందర్భంగా నగరంలో '15 ఇయర్స్ ఆఫ్ అనుష్కశెట్టి' అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఇంగ్లీష పేపర్‌తో అనుష్క ముచ్చటించారు.
'నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. గత కొన్నిరోజులగా నా పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష‌్టం చేశారు. అలాంటి పుకార్ల వల్ల నేను ఇబ్బందిపడను. బంధాలను ఎవరూ దాచలేరు. అలాగే నా పెళ్లి విషయాన్ని ఎందుకు దాస్తాను.? అని అనుష్క అన్నారు. నా వ్యక్తిగత విషయంలోకి ఇతరులు కలగజేసుకుంటే నచ్చదు. వివాహం బంధం చాలా పవిత్రమైనది.
నా పెళ్లి జరిగిన రోజు ప్రజలకు తప్పకుండా తెలుస్తుంది. నాకు పెళ్లి విషయం బయటకు చెప్పకుండా దాచుకునే వ్యక్తిని కాదు. బహిరంగంగా ఎవర్ని పెళ్లిచేసుకునేది నేను ప్రకటించకపోవచ్చు. కానీ ప్రజలు నన్ను ఎప్పుడైనా అడగొచ్చు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.' అని అనుష్క అన్నారు.
2015లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' 'బాహుబలి2' చిత్రం కోసం సుమారు 3సంవత్సరాలు తన కాలాన్ని వేచిచింది. అయితే రెండు భాగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించాయి. ప్రస్తుతం 'నిశబ్ధం' సినిమా చేస్తుంది. ఈ సినిమాతో వచ్చే నెల 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క నుండి వస్తున్న సినిమా కావటంతో ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




