Top
logo

13 ఏళ్ల తరువాత అనుష్క!

13 ఏళ్ల తరువాత అనుష్క!
Highlights

కేవలం మెగా అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సైరా...

కేవలం మెగా అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' అని చెప్పవచ్చు. మొట్ట మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కూడా ఒక స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడో 13 ఏళ్ల క్రితం 'స్టాలిన్' సినిమాలో ఓ ఐటెం సాంగ్లో కనిపించిన అనుష్క ఇన్నాళ్ళకు మళ్ళీ మెగా స్టార్ పక్కన 'సైరా' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోందట. ఈమె పాత్ర తాలూకు షూటింగ్ మే ఆఖరి వారంలో జరగనుంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ సుదీప్ కిచ్చా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Next Story