
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీలో స్మైలీ స్టార్ మాధవన్ కీ రోల్ పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో విడుదలకు ప్లాన్ చేయగా.. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయదా పడింది.థియేటర్స్‌లో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో వాయిదా పడింది.
ఈ సినిమాలో సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో వైవిధ్యమైన నటనతో అనుష్క నటించారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్‌సన్,సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల కీలక భూమిక పోషించారు. తాజాగా ఈ చిత్రంపై అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో దయచేసి ఇలాంటి వదంతులు నమ్మొదంటు ఏదైనా ఉంటే మేమే అఫీషియల్స్‌గా ప్రకటిస్తాం అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో నిర్మాతలకు అనుష్కకు మధ్య వివాదం నడుస్తోందంటూ కూడా పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో ఆన్ లైన్‌లో విడుదల చేయాలని అనుష్క అన్నట్లు టాక్ వచ్చింది. 'నిశ్శబ్దం-ఆన్ లైన్'హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. దీంతో నిశ్శబ్దం చిత్ర యూనిట్ వీటిపై క్లారిటీ ఇచ్చారు.
'నిశ్శబ్దం'సినిమా విషయంలో అనుష్క సహకారం మరువలేనిది. దయచేసి ఈ చిత్రంపై వస్తున్న రూమర్స్ నమ్మొద్దు. సినిమా ప్రారంభమైన తొలిరోజు నుంచి అన్ని విషయాల్లోనూ సినిమాకి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రాజెక్ట్‌కి పిల్లర్స్. కష్టమైనా, నష్టమైనా భరిస్తారు ఈ రూమర్స్ నమ్మొద్దు అవి నిజం కావునీ చిత్ర యూనిట్ తెలిపింది. అలాంటివి ఏమైనా ఉంటే స్వయంగా తెలియజేస్తాం'అంటూ 'నిశ్శబ్దం'సినిమా యూనిట్ స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




