డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Apologized to The Director
x

డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన అనుపమ పరమేశ్వరన్ 

Highlights

Anupama Parameswaran: "ఆరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను" అంటున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో మంచి హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇప్పుడు నిఖిల్ హీరోగా నటించిన "కార్తికేయ 2" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఈ భామ. చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ" వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

అయితే తాజాగా చిత్ర సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ డైరెక్టర్ చందు మండేటికి క్షమాపణలు చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గుజరాత్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుపమ పరమేశ్వరన్ కు గాయాలయ్యి వెన్నునొప్పి ఎక్కువైందట. కానీ షూటింగ్ చివరి రోజున సాంకేతిక సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైందట. ఒక వైపు తనకి నొప్పి ఎక్కువ అవుతున్నప్పటికీ షూటింగ్ కూడా ఆలస్యం అవ్వడంతో అలానే నొప్పితో సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో అనుపమ చందు మొండేటి తో సినిమా చేయటం నిరాశపరిచింది అంటూ పేర్కొంది. కానీ ఆరోజు తన ఆలోచన తప్పని తెలుసుకున్న అనుపమ అది చాలా పెద్ద మిస్టేక్ అని దానికి దర్శకుడు కి క్షమాపణలు చెప్పుకొచ్చారు. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష లు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories