నెక్స్ట్ సినిమా వెంకటేష్ తో ఉంటుంది అంటున్నా "జాతి రత్నాలు" డైరెక్టర్

Anudeep Gives Clarity About His Second Film
x

నెక్స్ట్ సినిమా వెంకటేష్ తో ఉంటుంది అంటున్నా "జాతి రత్నాలు" డైరెక్టర్

Highlights

Anudeep KV: తన రెండవ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అనుదీప్

Anudeep KV: ఈమధ్య కాలంలో యువ డైరెక్టర్లు మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2021 మార్చ్ లో కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా బ్లాక్బస్టర్ అయిన తెలుగు సినిమా "జాతి రత్నాలు" కి దర్శకత్వం వహించిన అనుదీప్ కేవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ ఈ సినిమా తర్వాత l నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చాలాకాలం పాటు తన నెక్స్ట్ సినిమా గురించి మౌనం వహించిన అనుదీప్ కేవీ ఎట్టకేలకు తన రెండవ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుదీప్ కేవీ తన నెక్స్ట్ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినట్లు తెలిపారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ "జాతి రత్నాలు" సినిమా లాగానే ఇది కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని కానీ ఇందులో ఎమోషన్లు కూడా ఉండబోతున్నాయని అన్నారు అనుదీప్. అయితే ఇంకా సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వెంకీ కి నెరేట్ చేయాల్సి ఉందని వెంకటేష్ కి కథ నచ్చితేనే సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు అనుదీప్. ఇక ఈ మధ్యనే సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ "జాతి రత్నాలు" డైరెక్టర్ కి ఓకే చెప్తారో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories