Mahesh Babu: ఘట్టమనేని కుటుంబం నుండి పుట్టుకు రానున్న మరొక హీరో

* ఇక మహేష్ త్వరలో తన సోదరుడి కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారా అని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

R Tripura Malini
Published on: 19 Nov 2022 11:59 AM IST
Another Hero To Join The Film Industry From Ghattamaneni Family
X

ఘట్టమనేని కుటుంబం నుండి పుట్టుకు రానున్న మరొక హీరో

Jaya Krishna: 2022 ఘట్టమనేని కుటుంబానికి తీరని దుఖం లోకి తోసేసింది. 2022 మొదట్లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించగా, తన తల్లి ఇందిరమ్మ కూడా ఈ మధ్యనే ప్రాణాలు విడిచారు. ఇది జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాక ముందు మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కూడా కోల్పోయాడు. అయితే కృష్ణ 3వ రోజు వేడుకలో ఒక యువకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనే రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ. ఈ వేడుకకు హాజరైన ఒకరిద్దరు నిర్మాతలు మరియు దర్శకుల కన్ను కూడా జయకృష్ణపై పడినట్టు తెలుస్తోంది. ఇక మహేష్ త్వరలో తన సోదరుడి కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారా అని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

జయకృష్ణ ప్రస్తుతం చదువుకుంటున్నప్పటికీ, అతను వెండితెరపైకి రావడానికి మహేష్ కూడా పూర్తి సహాయం అందించనున్నాడని తెలుస్తోంది. ఘట్టమనేని కుటుంబం నుండి మహేష్ బాబు తర్వాత ఇప్పటికే జయదేవ్ మరియు మహేష్ సోదరి కుమారుడు అశోక్ గల్లా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు, కానీ వారు అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. లుక్స్‌ని పరంగా చూస్తే జయకృష్ణకు హీరో లక్షణాలు బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి జయ కృష్ణ నిజంగా హీరోగా మారతారా? నిజంగా హీరో అయితే ఎంతవరకు సక్సెస్ అందుకుంటారు అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story