విజయశాంతి 'కిక్‌' మాములుగా లేదుగా.. బ్రహ్మాజీకి విజయశాంతి మాస్టర్ కిక్!

విజయశాంతి కిక్‌ మాములుగా లేదుగా.. బ్రహ్మాజీకి విజయశాంతి మాస్టర్ కిక్!
x
బ్రహ్మాజీకి విజయశాంతి మాస్టర్ కిక్
Highlights

13 సంవత్సరాలు తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లేడి అమితాబ్ విజయశాంతి ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. సరి లేరు షూటింగ్ సెట్‌లో ఆమె...

13 సంవత్సరాలు తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లేడి అమితాబ్ విజయశాంతి ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. సరి లేరు షూటింగ్ సెట్‌లో ఆమె సరదాగా ఓ స్టన్ట్‌ చేశారు. విజయశాంతి చేసిన స్టన్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చేసిన స్టంట్‌ సీన్‌ను స్లో మోషన్‌లో విడుదల చేశారు.

షూటింగ్ సమయంలో విజయశాంతిపై తీసిన ఓ వీడియోను అనిల్ రావిపూడి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో బ్రహ్మాజీని విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 13 సంవత్సరం తర్వాత అద్భుతమైన పునరాగమనం మేడమ్. విజయశాంతి మేడమ్ మాస్టర్ కిక్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు విజయశాంతిని అభినందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories