Tollywood: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య

Anil Ravipudi Multi Starrer Movie With Balakrishna and KalyanRam
x

 అనిల్ రావిపూడి దర్శకత్వంలోబాలయ్య

Highlights

Tollywood: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే బాలయ్య సినిమాలో కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్ర పోషించనున్నారట.

Tollywood: వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ టాక్. నిజానికి బాలకృష్ణ 100వ సినిమాను అనిల్ రావిపూడి చేయాలని చూశాడుగానీ కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు సమయం వచ్చింది. 'ఎఫ్ 3' పూర్తయిన తరువాత బాలకృష్ణ ప్రాజెక్టుపైనే అనిల్ రావిపూడి కూర్చోనున్నాడని సమాచారం.

ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. గతంలో కల్యాణ్ రామ్ కి అనిల్ రావిపూడి 'పటాస్'తో పెద్ద హిట్ ఇచ్చాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కూడా వర్కౌట్ కానుంది. బాబాయ్ ను .. అబ్బాయ్ ను ఒకేసారి తెరపై చూడటమనేది నందమూరి అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమని వేరే చెప్పాలా?

బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'అఖండ' సినిమాపై ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వాళ్లంతా కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'క్రాక్' సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని టేకింగ్ నచ్చేసి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మాత్రమే బాబాయ్, అబ్బాయ్ నటించే సినిమా రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories