Anikha Surendran: 6 ఏళ్లకే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది, 16 ఏళ్లకే ఫేక్ వీడియో బారిన పడింది.. ఎవరో గుర్తు పట్టారా.?

Anikha Surendran
x

6 ఏళ్లకే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది, 16 ఏళ్లకే ఫేక్ వీడియో బారిన పడింది.. ఎవరో గుర్తు పట్టారా.?

Highlights

Anikha Surendran: బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి టాప్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.

Anikha Surendran: బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి టాప్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి జాబితాలోకి వస్తుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల తార. 6 ఏళ్ల వయసులోనే బాల నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 16 ఏళ్లకే ఫేక్ వీడియోల బారిన పడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న అనిఖా సురేంద్రన్ ప్రస్తుతం ఓ క్రేజీ యువ హీరోయిన్ గా ఎదిగింది. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్తెగా విశ్వాసం సినిమాలో నటించిన అనిఖా, ఆ ఒక్క సినిమాలోనే భారీ గుర్తింపు తెచ్చుకుంది. అప్పటినుంచి ఆమె పేరుకి ప్రత్యేకంగా ఓ క్రేజ్ ఏర్పడింది. అదే సమయంలో, 16 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో ఆమెపై ఫేక్ వీడియోలు, ఫోటోల ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వాస్తవం కాదని నిరూపితమైంది.

చిన్న వయసులోనే సైబర్ బుల్లీయింగ్ ఎదుర్కొన్న అనిఖా, దాన్ని అడ్డంకిగా కాకుండా ప్రేరణగా మలుచుకుంది. ఆ ఘటనల అనంతరం ఆమెను ఏమాత్రం వెనక్కి లాగలేకపోయాయి. 18 ఏళ్లకే హీరోయిన్‌గా మళ్లీ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను బుట్టబొమ్మ చిత్రంతో అలరించిన అనిఖా, ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్టుల కోసం చర్చల్లో ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories