అందంగా ఉన్నవారే కావాలట..అందుకే 'అదిరింది' నుంచి నన్ను తప్పించారట !

అందంగా ఉన్నవారే కావాలట..అందుకే అదిరింది నుంచి నన్ను తప్పించారట !
x
Sameera Adirindi Show
Highlights

బుల్లితెరలో నవ్వుల సృష్టించిన కామెడీ షో జబర్ధస్త్. ఈ షోలో బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేస్తోంది. అయితే దానికి పోటీగా ఎన్ని షోలు వచ్చినప్పటికీ అవి నిలదొక్కుకున్న సందర్భాలు లేవు.

బుల్లితెరలో నవ్వుల సృష్టించిన కామెడీ షో జబర్ధస్త్. ఈ షోలో బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేస్తోంది. అయితే దానికి పోటీగా ఎన్ని షోలు వచ్చినప్పటికీ అవి నిలదొక్కుకున్న సందర్భాలు లేవు. ఆ షోతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని మళ్లి జీ తెలుగులో 'అదిరింది' కామెడీ షోతో ముందుకొచ్చారు. చాలా మంది ఆర్టిస్టులు కూడా 'అదిరింది' షోలో మెరిశారు. దీంతో ఆ షో కూడా పాపులర్ అయింది.ఈ షోకు యాంకర్ గా బుల్లితెర సిరీయల్ నటి సమీర చేసింది. ఆమె భార్యామణి, ఆడపిల్లలాంటి సిరీయల్స్ లో ప్రేక్షకులకు సుపరిచితురాలే.

అయితే ఇటీవలే అదిరింది కామెడీ షో నుంచి యాంకర్ సమీర బయటకొచ్చిన సంగతి తెలిసిందే. సమీరాను పక్కన పెట్టిన అదిరింది బృందం. సమీర స్థానంలో కానీ షోలో రవి, భానుశ్రీ యాంకర్లుగా చేరారు. యాంకర్ల రవి, భానుశ్రీతో షూట్ చేసిన ప్రోమోను విడుదల చేశారు. అయితే సమీర షో నుంచి తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. సమీర ప్రెగ్నెంట్ అని, 10 ఎపిసోడ్లకే ఒప్పందం కుదుర్చుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఆమెపై వచ్చిన రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ సమీర స్పందించారు. ఈ సందర్బంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

"ఈ వీడియోలో సమీరా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నేను ప్రెగ్నెంట్ కాదు. మీరంతా నా కుటుంబం కాబట్టి అలాంటి గుడ్‌న్యూస్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. ఎవరి మీదా నాకు ఎలాంటి కోపాలు, కుళ్లుకోవడాలు లేవు. ఏం జరిగినా... మన మంచికే అనుకోవాలి. నేను అదిరింది షోకు యాంకర్‌గా చేస్తున్నప్పుడు మార్చండి అని కామెంట్స్ చేసినవారే.. ఇప్పుడు వెళ్లిపోయాక ఎందుకు వెళ్లిపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు. అదిరింది షో ఇక నుంచి మరింత అదిరిపోతుంది అనుకుంటున్నాను. షోలో నేను భాగం కానంత మాత్రాన షోని మర్చిపోను. ప్రతీవారం తప్పకుండా షో చూస్తాను. ధన్యవాదాలు'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో సమీర తెలిపారు.

. అదిరింది షో నుంచి ఎందుకు తప్పుకున్నారని చాలా మంది అడుగుతున్నారు. సన్నిహితులు, బంధువులు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. అదిరింది షో నుంచి తప్పుకోవడం గురించి అందరికీ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అదిరింది షో నుంచి నా అంతట నేను వెళ్లిపోలేదు. నిర్వాహకులే తీసేసారు. ఈ విషయం నాకు మీడియా ద్వారానే తెలిసింది. ప్రొడక్షన్ వాళ్లు చెప్పలేదు. నేను నేరుగా వెళ్లి అడిగితే తొలిస్తున్నామని యాంకర్‌ను మార్చాలని అనుకుంటున్నామని తెలిపారు. నేను వారికి ఏమీ అడగలేదు. నాకు ఆ అవసరం లేదు. నాకు తెలిసిన వారు కొత్త ప్రోమో పంపిస్తే చూశాను అని తెలిపారు

అందిరింది షో రవి, భానుశ్రీలతో చేస్తున్నారని తెలిసింది. రవి, భానుశ్రీలు నాకు తెలుసు. మంచి యాంకర్స్. మరో విషయం ఏమిటంటే నేను 10 ఎపిసోడ్లకు కాంట్రాక్ట్‌ ఒప్పుకోలేదు. 26 ఎపిసోడ్లకు కాంట్రాక్ట్‌పై సంతకం చేశాను. కానీ, ప్రొడక్షన్ వాళ్లకు టెక్నికల్‌గా లేదా ప్రొడక్షన్ పరంగా ఏదైనా సమస్యలు వచ్చి ఉండొచ్చు. పదిహేనేళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నాను. టెక్నికల్‌గా వచ్చే సమస్యలు నాకు తెలుసు. అయితే నన్ను ఈ షో నుంచి ఎందుకు తీసేసారు అని మాత్రం అడగలేదు. అందంగా ఉండే యాంకర్ వారికి కావాలేమో. నేను ప్రెగ్నెంట్ అని రూమార్స్ వచ్చాయి. అవి నిజం కాదు. అయితే సమీరా షోనుంచి తప్పుకోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. సమీ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories