BB5 Telugu: వాళ్ళను కాపాడటం కోసం రవిని బలి చేశారు..యాంకర్ రవి ఫ్యాన్స్ ఆగ్రహం

Anchor Ravi Fans Fires on Bigg Boss Telugu Season 5 Ravi Elimination
x

BB5 Telugu - Ravi: కొంతమందిని కాపాడటం కోసం రవిని బలి చేశారు.. యాంకర్ రవి ఫ్యాన్స్ ఆగ్రహం

Highlights

* ఓట్ల లెక్క చూపెట్టాలని బిగ్ బాస్ యాజమాన్యానికి యాంకర్ రవి అభిమానుల డిమాండ్

Bigg Boss 5 Telugu - Ravi: సోషల్ మీడియాలో యాంకర్ రవి అభిమానుల చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 5 లో మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి ఈవారం(12) ఎలిమినేట్ అవుతున్నాడనే శనివారం వార్తలు రావడంతో అభిమానులు బిగ్ బాస్ షో పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టాప్ 5 కంటెస్టెంట్‌ గా మొదటి వారం నుండి రేసులో తమ అభిమాన కంటెస్టెంట్‌ ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అవడంతో ఓటింగ్ లో తేడా జరిగిందని బిగ్ బాస్ నిర్వాహకులు నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులందరి ఓట్ల లెక్క చూపించాలని యాంకర్ రవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క రవి ఎలిమినేట్ అయిన విషయం తెలియగానే ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కొంతమంది అభిమానులు కూడా బిగ్ బాస్ షోపై తమ నిరసన వ్యక్తం చేశారు. అంత పాపులర్ కంటెస్టెంట్‌ ఇలా ఎలిమినేట్ అవడం వెనుక ఏదో కుట్ర ఉందని.. ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, సిరి హనుమంత్ కంటే రవికి ఓట్లు తక్కువ వచ్చే అవకాశమే లేదని బల్లగుద్ది చెబుతున్నారు రవి ఫ్యాన్స్. తమ అభిమాన కంటెస్టెంట్‌ కి అన్యాయం చేసినందుకు ఇకపై బిగ్ బాస్ షోని కూడా చూడమని కొంతమంది కంటెస్టెంట్స్ ని కాపాడటం కోసమే రవిని బలి చేశారని తెలిపారు.

ఇక ఎలిమినేట్ అయి బిగ్ బాస్ స్టేజిపైకి వచ్చిన రవి కూడా శన్ముఖ్ జస్వంత్ తో మాట్లాడుతూ నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావని చెప్పడం వెనుక కూడా బుల్లితెర ప్రేక్షకులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బిగ్ బాస్ గత సీజన్ లోలాగే ఈ ఏడాది కూడా ఓటింగ్ పై మరోసారి అనుమానాలు వ్యక్తమవడంతో బిగ్ బాస్ యాజమాన్యం అటు అభిమానులకు, ఇటు కంటెస్టెంట్‌ లకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచిచూడాల్సిందే..!!

Show Full Article
Print Article
Next Story
More Stories