Lasya Manjunath: తండ్రి కోసం ఇంటిని గిఫ్ట్ గా ఇస్తున్న యాంకర్

Lasya Manjunath: తమ తండ్రికి ఇల్లు కట్టిస్తున్న యాంకర్ లాస్య

admin1
Updated on: 17 Jan 2022 10:00 PM IST
Anchor Lasya Manjunath Giving Home as a Gift for Dad
X

 తండ్రి కోసం ఇంటిని గిఫ్ట్ గా ఇస్తున్న యాంకర్

Lasya Manjunath: ఒకప్పుడు ప్రముఖ యాంకర్ గా పేరు తెచ్చుకున్న లాస్య ఈ మధ్యనే మళ్లీ బిగ్ బాస్ షో తో లైమ్ లైట్ లోకి వచ్చింది. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి తన భర్తతో కలిసి వీడియోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లాస్య ఇప్పుడు తన తండ్రికి ఇల్లు కట్టిస్తుంది. ఈ విషయాన్ని తానే తన యూట్యూబ్ ఛానల్ లోని ఒక వీడియో లో పంచుకుంది. "నా చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఆ మధ్య కూలగొట్టడం కదా. దాని స్థానంలో ఇప్పుడు కొత్త ఇంటిని కట్టిస్తున్నాను. ఇప్పటికే చాలావరకు పనులు పూర్తయ్యాయి" అంటూ ఆ ఇంటిని కూడా తన వీడియో లో చూపించింది లాస్య.

తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆయన సంతోషం చూస్తే తనకు కడుపు నిండిపోతుంది అని చెప్పిన లాస్య ఆయన కోసమే చాలా ఇష్టంగా ఇంటిని కట్టిస్తున్నట్లు చెప్పింది. ఇంటి వీడియో ని పంచుకున్న లాస్య గృహప్రవేశం చేసేటప్పుడు కూడా తప్పకుండా వీడియో చేస్తానని అభిమానులకు చెప్పుకొచ్చింది. ఇక ఇంటితోపాటు తన తండ్రి మరియు తన కొడుకు తో కలిసి ట్రాక్టర్ లో ఊరంతా ఒక రౌండ్ కూడా వేసిందట. తండ్రి కోసం ఇల్లు కట్టి ఇస్తున్నాను అని చెప్పడంతో అభిమానులు కూడా ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

admin1

admin1

Next Story