Thankyou Brother: ఓటీటీలో రిలీజైన థ్యాంక్యూ బ్రదర్ ఎలా వుందంటే...

Anchor Anasuyas Thank You Brother Movie Review
x

అనసూయ నటించిన థంక్ యు బ్రదర్ 

Highlights

Thankyou Brother: యాంకర్ అనసూయ “థ్యాంక్యూ బ్రదర్” కరోనా కారణంగా నేడు ఓటీటీలో రిలీజైంది.

Thankyou Brother: `నాకేంటి..` అనే ధీమా. `నేనే` అనే స్వార్థం. `నాతోనే` అని అహంకారం.. నిండా ఉన్న ఓ కుర్రాడిని ఓ చిన్న ఘ‌ట‌న మార్చేస్తుంది. అదేంటి? అన్న‌దే థ్యాంక్యూ బ్రదర్ కథ. కరోనా కారణంగా ఈ సినిమా ఈరోజు ఆహాలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుంది, ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ పొందిందో చూదాం. యాంకర్ అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం "థ్యాంక్యూ బ్రదర్". ఈ సినిమాలో అనసూయ నటిస్తుండడం వల్ల కాస్త అంచనాలు పెరిగాయి.

అభి (విరాజ్ అశ్విన్‌) గొప్పింటి కుర్రాడు. అహంకారం ఎక్కువ‌. ఆటిట్యూడ్ చూపిస్తుంటాడు. అమ్మ మాటంటే లెక్క లేదు. తాగ‌డం, అమ్మాయిల వెంట తిర‌గ‌డం, విచ్చ‌ల‌విడిత‌నం అన్నీ మెండుగా ఉన్నాయి. మ‌రోవైపు ప్రియ (అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌) క‌థ‌. భ‌ర్త కోల్పోయిన బాధ‌లో ఉంటుంది. నిండు గ‌ర్భ‌వ‌తి. ఓసారి ఇద్ద‌రూ లిఫ్టులో చిక్కుకుపోతారు. ప్రియ‌కి నొప్పులు ఎక్కువ అవుతాయి. అభికి ఇలాంటి ప‌రిస్థితి పూర్తిగా కొత్త‌. మ‌రి ఆ లిఫ్టులో ఏం జ‌రిగింది..? ప్రియ‌ని అభి ఎలా కాపాడాడు? అభిలోని మ‌నిషి ఎప్పుడు, ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాడు? అనేది మిగిలిన క‌థ‌.

తొలి భాగమంతా.. అభి ఆటిట్యూడ్ చూపించ‌డానికి స‌రిపోయింది. డ‌బ్బుంద‌న్న అహంకారం. డ‌బ్బుని చూసి చుట్టూ చేరిన స్నేహితులు, అమ్మాయిల‌తో ఆడుకోవ‌డం, వాళ్ల‌ని వాడుకోవ‌డం… అంతా ఇదే. లిఫ్టులో చిక్కుకోవ‌డం నుంచి ద్వితీయార్థం మొద‌ల‌వుతుంది. డాక్ట‌రు స‌ల‌హాతో…అభి.. ప్రియ‌ని కాపాడ‌డం అంతా సెకండాఫ్ లో జ‌రుగుతుంది.ప్రియ పాత్ర‌కు ఇచ్చిన నేప‌థ్యం కూడా సో… సోగా ఉంటుంది. గ‌మ్యం దాదాపుగా ఇలాంటి స్టోరీనే. డ‌బ్బుంద‌న్న అహంకారంతో విచ్చ‌ల విడిగా ప్ర‌వ‌ర్తించే ఓ కుర్రాడు.. ఎలా మారాడ‌న్న‌దే ఆ క‌థ‌. త‌న చేతిలో ఓ శిశువు ఊపిరి పోసుకోవ‌డం, త‌న చేతిలోనే ఓ స్నేహితుడి ఊపిరి పోవ‌డంతో జీవితం అంటే అర్థం, అందులో ఉన్న అర్థం తెలుస్తుంది. ఇక్క‌డా అంతే. కాక‌పోతే ఆ క‌థ‌ని మ‌లిచిన తీరే వేరు.

ఇలాంటి క‌థ‌లు ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవ్వాలి. అలా జ‌ర‌గాలంటే.. ఆ పాత్ర‌ల న‌డ‌క‌, న‌డ‌త అన్నీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలి. ఆ పాత్ర‌ల్ని ఫీల్ అవ్వాలి. అయితే…. `థ్యాంక్యూ` బ్ర‌ద‌ర్‌లో అవేం జ‌ర‌గ‌వు. చివ‌ర్లో క‌థానాయికుడిలో వ‌చ్చే మార్పు కృత్రిమంగా ఉంటుంది. ఇనిస్టెంట్ గా క‌నిపిస్తుంది. ఎప్పుడూ గ్లామ‌ర్ కురిపించే పాత్ర‌లు పోషించే అన‌సూయ‌.. ఓ కొత్త త‌ర‌హా పాత్ర పోషించింది. వీరిద్ద‌రు మిన‌హాయిస్తే.. ఎవ‌రి స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా ఉండ‌దు. సో సోగా సాగింది ఈ సినిమా. సగటు ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories