Ravi Teja Movie: రవితేజ అత్తగా మారబోతున్న ప్రముఖ యాంకర్

Ravi Teja Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్బస్టర్ ని అందుకున్నారు.

admin1
Updated on: 5 Feb 2022 4:21 PM IST
Anchor Anasuya Acting the Mother of the Heroine in Ravi Teja Movie
X

రవితేజ అత్తగా మారబోతున్న ప్రముఖ యాంకర్

Ravi Teja Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్బస్టర్ ని అందుకున్నారు. ఒక్క సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ ఇప్పుడు "ఖిలాడి" తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా థియేటర్ల విషయంలో నిబంధనలను తీయకపోవడంతో సినిమాని ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ మరియు నటి అయిన అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు ఆసక్తికరమైన పాత్రలు చేస్తూ వెండితెరమీద కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనసూయ భరద్వాజ్. ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించిన అనసూయ తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది. తాజాగా ఇప్పుడు "ఖిలాడి" సినిమా లో రవితేజ తో కూడా అనసూయ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అనసూయ హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించనుందట. అంటే రవితేజ కి అత్త పాత్రలో అనసూయ నటిస్తోంది అని సమాచారం. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

admin1

admin1

Next Story