ఆచార్య కథను మలుపు తిప్పనున్న అనసూయ.. రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Anasuya  Took a remuneration  for Chiranjeevi Movie
x

చిరంజీవి సినిమా కోసం పాతిక లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న అనసూయ 

Highlights

Anasuya: *ఆచార్య కథను మలుపు తిప్పనున్న అనసూయ

Anasuya: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా రామ్ చరణ్ మరియు పూజాహెగ్డే లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ సినిమాలో అనసూయ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ పాత్ర ఈ సినిమా కథను ఒక కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.

ఆమె పాత్రకి ఉన్న డిమాండ్ వల్లనే అనసూయ ఈ సినిమా కోసం ఏకంగా పాతిక లక్షల దాకా రెమ్యునిరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన అనుసూయ ఇప్పుడు మెగాస్టార్ తో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఒకవైపు యాంకరింగ్ తో బిజీగా ఉన్న ఈ భామ వెండితెరపై కూడా తన అందం అభినయంతో అందరి దృష్టిని బాగానే ఆకట్టుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories