Anchor Anasuya: అటు సినిమాలు.. ఇటు స్పెషల్ సాంగ్స్‌.. హరిహర వీరమల్లులో పవన్‌తో అనసూయ స్టెప్పులు

Anasuya Special Song in Harihara Veeramallu
x

అటు సినిమాలు.. ఇటు స్పెషల్ సాంగ్స్‌.. హరిహర వీరమల్లులో పవన్‌తో అనసూయ స్టెప్పులు

Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం పరిచయం లేని యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ షో ద్వారా తన మాటలు, నవ్వులతో రచ్చ చేసిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Anchor Anasuya: తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం పరిచయం లేని యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ షో ద్వారా తన మాటలు, నవ్వులతో రచ్చ చేసిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల పుష్ప2లో నటించిన అనసూయ ఇప్పుడు హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. హరిహర వీరమల్లు నుంచి తాజాగా విడుదలైన కొల్లగొట్టినాదిరో సాంగ్ ప్రోమోలో అనసూయ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. ఈ పాటలో అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.

క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ పెంచాయి. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఇటీవల పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ కొల్లగొట్టినాదిరో అని సాగే లిరికల్ సాంగ్‌ను ఈ నెల 24న మూడు గంటలకు విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌తో ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా సాంగ్ ప్రోమోని సైతం రిలీజ్ చేసి డబుల్ బొనాంజా ఇచ్చారు. కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగే ఈ గీతం అందరినీ అలరించేలా ఉంది. ఇక ఈ పాటలో అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఈ బ్యూటీలు ఇద్దరు పవన్‌తో కలిసి స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు మంగ్లీ, రమ్య బెహర, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు చంద్రబోస్ రిలిక్స్ అందించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు అనసూయ. యాంకర్‌గా చాలా కాలం బుల్లితెరపై హవాను చూపించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో నాగార్జున డ్యుయల్ రోల్‌లో నటించిన సోగ్గాడే చిన్ని నాయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఈ సినిమాలో చిన్న పాత్రతో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశారు. ఆ తర్వాత వరుసగా క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్సూ బ్రదర్, ఖిలాడీ, పుష్ప, దర్జా సహా ఎన్నో సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. ఇటీవల రంగమార్తాండ, విమానం సినిమాల్లోని అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. తమిళంలో ఫ్లాష్ బ్యాక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. మరో సినిమా వోల్ఫ్ నవంబర్‌లో రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories