Anasuya - Sunil: 18 ఏళ్ల తర్వాత ఆ కమెడియన్ తో అనసూయ

* మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సునీల్, అనసూయ

admin1
Updated on: 15 Nov 2021 7:00 PM IST
Anasuya and Sunil Acting in Pushpa Movie After 18 Years
X

18 ఏళ్ల తర్వాత ఆ కమెడియన్ తో అనసూయ

Anasuya - Sunil: ఈమధ్యనే "అల వైకుంఠపురంలో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" అనే టైటిల్ తో ఈ ఏడాది డిసెంబర్ 17న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోందని దర్శక నిర్మాతలు ప్రకటించారు.అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే సునీల్ మరియు అనసూయ ఇంతకుముందు ఒక సినిమాల్లో కలిసి నటించారు అన్న విషయం మీకు తెలుసా? ఇది ఇప్పటి విషయం కాదు. 2003 లో ఎన్టీఆర్ హీరోగా నటించిన "నాగ" సినిమా మా లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే కమెడియన్ గా ఎదుగుతున్న సునీల్ ఆ సినిమాలో కూడా ఒక కమెడియన్ పాత్రలో కనిపించారు. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనసూయ ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. వీరిద్దరూ కలిసి ఒక కామెడీ సన్నివేశంలో కూడా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సునీల్ మరియు అనసూయ కలిసి వెండి తెరపై కనిపించనున్నారు. కాబట్టి ఈ సినిమా ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story