Ananya Panday: లైగర్ సినిమాపై అనన్య పాండే తండ్రి కీలక వ్యాఖ్యలు

Ananya Panday Was Uncomfortable Doing Liger Says Actress Father
x

లైగర్ సినిమాపై అనన్య పాండే తండ్రి కీలక వ్యాఖ్యలు

Highlights

అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరంలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అనన్య ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరనసన హీరోయిన్‌గా నటించారు.

Ananya Panday: అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరంలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అనన్య ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరనసన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీపై అన్యన్య పాండే తండ్రి చంకీ పాండే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

లైగర్ సినిమాలో నటించడం అనన్యకు ఏ మాత్రం ఇష్టంలేదని.. కాకపోతే తన వల్లే ఈ సినిమాలో నటించిందన్నారు. ఈ సినిమాలో అనన్యకు ఛాన్స్ వచ్చినప్పుడు తను ఎంతో అసౌకర్యంగా ఫీలైందన్నారు. ఈ మూవీలో ఆ పాత్రకు తాను అసలు సెట్ కానని, చిన్న పిల్లలా ఉంటానని తనతో చెప్పిందన్నారు. కానీ అది పెద్ద ప్రాజెక్ట్ అని సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందని చెప్పి తాను ఒప్పించానన్నారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక తను చెప్పిందే నిజమయిందని.. తను ఆ క్యారక్టర్‌కి చాలా యంగ్‌గా అనిపించిందన్నారు. ఆ తర్వాత తనకి ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన సలహాలు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మంచి ప్రాజెక్టులు సెలక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తోందని చంకీ పాండే చెప్పారు. చంకీ పాండే బాలీవుడ్‌లో మంచి నటుడు. ఎన్నో చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకులను మెప్పించారు.

అనన్య కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో లైగర్ సినిమా గురించి మాట్లాడారు. నిర్మాత కరణ్ జోహార్, తన తండ్రి వల్లే ఈ సినిమాలో నటించానన్నారు. ప్రతి సినిమాకి తన తల్లి రివ్యూ ఇస్తుందని.. లైగర్ చూసి జస్ట్ ఫర్ ఫన్ అంటూ రిప్లై ఇచ్చారని చెప్పారు. తన జీవితంలో అతి చెత్త రివ్యూ అదే అనిపించిందన్నారు. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఆ తప్పుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అర్థమైందన్నారు అనన్య.

విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా మూవీగా లైగర్ రిలీజైంది. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.60 మాత్రమే వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా. 2022లో విడుదలైన ఈ సినిమాపై అనన్య తండ్రి ఇప్పుడు మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories