Ananya Panday: ఆమె వల్లే నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది: అనన్య పాండే

Ananya Panday praises Deepika Padukone
x

ఆమె వల్లే నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది: అనన్య పాండే

Highlights

అనన్యపాండే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పరిచయమైంది.

Ananya Panday: అనన్యపాండే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో తిరిగి బాలీవుడ్‌కు చెక్కేసింది. తన అందాలతో అభిమానులను అయితే సొంతం చేసకున్నారు. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు అనన్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకు మొదట్లో పలు సవాళ్లు ఎదురైనట్టు చెప్పారు. కెరీర్ ప్రారంభంలో సెట్స్‌లో ఏది చెప్తే అది చేసేదాన్నని.. అంతే తప్ప తన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పాలి అనే విషయం తనకు తెలియదన్నారు. ఎలా ఉండాలనేది గెహ్రియాన్ సినిమా సెట్‌లోనే అర్థమైందన్నారు.

ఆ సినిమాలో తన సహ నటి దీపికా పదుకొణె నటించారు. ఆమె సెట్‌లో ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేవారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేవారు. అందిరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహించేవారని చెప్పారు. ఆమె స్టార్ హోదాలో ఉన్నారు. అయినా తనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నా.. ఇంకా చెప్పాలంటే దీపిక వల్లే తన ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందన్నారు అనన్య పాండే.

Show Full Article
Print Article
Next Story
More Stories